ఫ్రెండ్స్..
మీ అందరి కోసం..
నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ రూపంలో..
ఈ బ్లాగ్.
మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ..
మీ
బిలాల్ టిచర్.
* * * * * * * * * * * * * * * * * * * * * *
ఎన్నో భావాలను, మాటలను
నీతో పంచుకోవాలని, నీతో చెప్పాలని
వాటిని గుండె గదిలో జాగ్రర్తగా దాచుకొని
నీ దాకా వస్తాను.
కానీ నిన్ను చూడగానే...
ఆ భావాలూ, ఆ మాటలు..
ఏదీ? ఒక్కటీ గుండె గది గుమ్మం దాటి
బయటికొస్తేగా?
అందుకే ఏం చేయాలో అర్థం కాక..
నిన్ను చూస్తూ..
నిశ్శబ్దంగా ఉండి పోతాను.
* * * * * * * * * * * * * * * * * * * * *
నీకు సూర్యకాంతం పుష్పం తెలుసా?
అది, సూర్యుడు ఏ వైపు ఉంటే
ఆ వైపు తిరుగుతుంది.
అలాగే..
నువ్వెక్కడున్నా..
నా ఆలోచనలన్నీ నీ చుట్టే!!!
* * * * * * * * * * * * * * * * * * * * *
అలికిడైతే చాలు
ఆశ తో నా కనులు
వెదికేను నలుదిశలు
నువ్వేమో అనుకొని...
* * * * * * * * * * * * * * * * * * * * *
రమ్మంటే చాలు కానీ
రాజ్యాలు విడిచి రానా..
నీ చిన్ని నవ్వు కోసం
స్వర్గాలు నడిచిరానా..
* * * * * * * * * * * * * * * * * * * * *
నువ్వు నాకు గుర్తొస్తే
ఎవరూ ఉండరు..
నీ ఙ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే
అసలు నేనే ఉండను..
నువ్వు తప్ప...!!!!
* * * * * * * * * * * * * * * * * * * * *
ప్రియతమా..
నవ్వినా, ఏడ్చినా "కన్నీళ్ళే" అన్నది
ఎంత నిజమో,
నువ్వు లేకుండా నేను బ్రతకడం
కష్టమన్నది కూడా
అంతే నిజం.!
* * * * * * * * * * * * * * * * * * * * *
నీ పెదవులను నా చూపుడు వ్రేలి తో మూసి,
"ఇలా కాదు నోరు మూయాల్సింది" అని
నువ్వు చిలిపి గా అంటే..వినాలని వుంది.
ఆ క్షణంలో నువ్వు ఊహించలేని నన్ను
నీ ముందు ఉంచాలని....
* * * * * * * * * * * * * * * * * * * * *
నువ్వంటే నాకెంత ఇష్టం అంటే..
నా నుంచి నేను పారిపోయి,
నిన్ను చేరుకోవాలన్నంత ఇష్టం.!
* * * * * * * * * * * * * * * * * * * * *
నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు..
నీ ఙ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను..
నువ్వు తప్ప!!
* * * * * * * * * * * * * * * * * * * * *
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవడం కాదు..
నువ్వు లేనప్పుడు నవ్వునీ..
నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం!!!
* * * * * * * * * * * * * * * * * * * * *